My Blog List

Wednesday, August 17, 2011


ఆజాద్ ' నేతాజీ

సుమారు రెండు వందల సంవత్సరాల పరాయి పాలన దుష్ఫలితాలు మన 

మనసులనుంచి అప్పుడే చెరిగిపోవు. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది 
కాదన్నారు రమణ. 

అలాగే ఇంత దుర్భరమైన... దాస్య శృంఖలాలలో మ్రగ్గిపోయిన బతుకులు అంత 
తొందరగా తెప్పరిల్లవు. ఆ మరకలు అంత తొందరగా చెరిగిపోవు. 

తరాలు మారుతున్నా ఆ కన్నీటి గాథల్ని, దుర్భర నరకాన్ని ఇప్పటికీ ఇంకా 
తలచుకుంటూనే వుంది మన జాతి. 65 ఏళ్ళు గడిచిపోతున్నా స్వాతంత్ర్య ఫలాన్ని
 అందించిన మహానుభావుల్ని మరచిపోలేదు ఈ దేశం. 

ఎందరెందరు... ఎన్ని త్యాగాలు... ఎన్నెన్ని పంథాలు... అవి చెప్పుకుంటే తరిగేవి 
కావు.ఏ దారిన వెళ్ళినా అందరి లక్ష్యం ఒక్కటే ! మన జాతి స్వతంత్ర్యంగా 
జీవించాలి.పరాయివాళ్ళ తొత్తులు కాకూడదు. మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి.
ఇదీ అప్పటి మహనీయుల ఆశయం. 


అలాంటి మహానుభావుల్లో అగ్రగణ్యులుగా 
పేరు తెచ్చుకున్నవారిలో ప్రముఖులు
నేతాజీ సుభాస్ చంద్ర బోస్. బ్రిటిష్ వారి 
మీద తిరుగుబాటుకోసం స్వంతంగా సైన్యాన్నే 
నిర్మించిన ధీశాలి.ఎన్నో కష్టనష్టాలు భరించారు. 
తన నిండు జీవితాన్ని దేశంకోసం బలి చేసారు. 

Monday, August 15, 2011

ఈ ఫోటోలో మన రాజకీయ నాయకుల్ని ఊహించుకుని తృప్తి పడండి!






ఈ ఫోటోలో మన రాజకీయ నాయకుల్ని ఊహించుకుని తృప్తి పడండి!
నేను ఈ ఫోటో facebook లో చూసాను. ఈజిప్ట్ లో ఒక పోలీసు ఆఫీసర్ ని జనం ఈ విధంగా నిలదీసి అడుగుతున్నారు. నా కెందుకో చెప్పలేని ఆనందం ఈ ఫోటో చుసిన దగ్గర నుంచి (may be sadistic ఆనందం అనుకుంటాను). ఏవేవో పిచ్చి ఊహలు, ఆశలు….నిన్నటి నుంచి ఊహించుకుని, ఊహించుకుని నవ్వుకుంటున్నాను. ఈ చిన్ని, పిచ్చి ఆనందాన్ని మీ అందరితో పంచుకొందామని ఈ సాహసం…

Mohammad Sedki, a high-ranking Egyptian policeman, has his chin held high by a revolutionary, as he breaks down in tears upon arriving into Tahrir Square with about 75 other policemen. The police have long been hated by Egyptians.
ఒక్కసారి ఊహించుకోండి ఆ పోలీసు ఆఫీసర్ ప్లేస్ లో మన the great politicians KCR, జగన్, రోశయ్య, చంద్రబాబు, చిరంజీవి…….మీ ఇష్టం.
జగన్: రాష్ట్రాన్ని దోచేసి, ఓ టీవీ ఛానల్, న్యూస్ పేపర్ మొదలు పెట్టగానే …నువ్వొక గొప్ప నయకుడివైపోయవు అనుకుంటున్నావా? దోచిందంతా తియ్, బయటకు తియ్….నీ చెత్త రాజకీయ యాత్రలు ఆపుతావా లేదా?
కెసిఆర్: చచ్చుడొ…….. ఇచ్చుడొ…..(ఎందుకులేండి…మీరే ఊహించుకోండి)
రోశయ్య: నీ చేతుల్లో ఏమి లేనప్పుడు …..
చంద్రబాబు: Hitech city….. హైదరాబాదు …పల్లెలు…..వ్యవసాయం….
చిరంజీవి: సినిమాలు… రాజకీయాలు…పార్టి…టికెట్….. కోట్లు…విలీనియం
ఇంకా ఇంకా చాల చాల రాయాలని దురదగా ఉంది. రాస్త
మీ శక్తి మేర, మేధస్సు మేర, ఊహించుకుని నాకు లాగా సంతోష పడండి. కాసేపు నవ్వుకోండి. మన అసహయతకు బాధపడండి…
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని నాయకుడ్ని,
ఎన్ని వేల కోట్లు మింగాడో,
ఎన్ని వేల ఎకరాలు అక్రమించాడో,
ఎందరి పొట్టలు కొట్టాడో,
ఎంత బంధు ప్రీతి చూపించాడో ??
మెడలు వంచి నిలదీయి,
దోచిన సొమ్మంతా కక్కేదాకా,
నడ్డి విరిచి తన్ను,
మళ్లీ ఎన్నికల్లో నిలబడకుండా. (సిరివెన్నెల గారి పాట స్పూర్తితో …..)

Thursday, August 4, 2011